ఎస్. సోమశేఖర్- చిత్తూరు: మీరు అష్టమి శనివారం, తులా లగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. ధనాధిపతి అయిన బుధుడు చతుర్థము నందు యోగము నందు ఉండటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీకు ఉత్తరం కానీ, పడమర కానీ కలిసివస్తుంది. నీలకంఠేశ్వరుని పూజించడం వల్ల పురోభివృద్ధి, ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. 2004 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2016 అక్టోబర్ నుంచి 2021 వరకు యోగాన్ని ఇస్తుంది. ఏదైనా దేవాలయాల్లో పిప్పలి చెట్టును నాటినట్లైతే మీ సంకల్పం సిద్ధిస్తుంది.