ఎస్. భరత్- రాజమండ్రి: మీరు తదియ బుధవారం కర్కాటక లగ్నము, ఆశ్లేష నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. కళత్ర కారకుడైన శుక్రుడు కుజునితో కలయిక వల్ల కుటుంబీకులతో సరదాగా ఉండటం, క్షణికోద్రేకం లేకుండా ఉండటం మీకు చాలా ముఖ్యం. ప్రతీ రోజు లక్ష్మీనరసింహస్వామిని పూజించడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.