సతీష్- బెంగళూరు: మీరు ఏకాదశి బుధవారం, వృశ్చికలగ్నము, జ్యేష్ట నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసిన పచ్చని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. భార్య స్థానాధిపతి అయిన శుక్రుడు రవి, బుధ, కుజునితో కలయిక వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి. 2016 అక్టోబర్ నుంచి 2017 మేలోపు మీకు వివాహం అవుతుంది. దక్షిణం నుంచి కానీ, ఉత్తరం నుంచి కానీ సంబంధం స్థిరపడగలదు. ఏదైనా దేవాలయాల్లో కొబ్బరి చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.