సి.హెచ్. సురేష్ గోపాల్- వరంగల్: మీరు తదియ ఆదివారం, వృశ్చిక లగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. ధనస్థానము నందు కేతువు ఉండటం వల్ల 100 స్పీడులో ధనం రావడం, 300 స్పీడులో ధనం పోవడం అనేది ఉంటుంది కాబట్టి ధనాన్ని నిలిపే ప్రయత్నం మీరే చేయాలి.
అష్టమ స్థానము నందు రవి, రాహులు ఉండటంవల్ల ప్రతీ చిన్న విషయాలనికి ఆందోళనలు వంటివి ఎదుర్కొంటారు. 2004 నుంచి శుక్ర మహర్థశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2017 నుంచి 2024 వరకు యోగాన్ని ఇస్తుంది. వైద్యనాదుడిని ఆరాధించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. ఏదైనా దేవాలయాల్లో పిప్పలి చెట్టును నాటిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.