చైతన్య - కొత్తగూడెం: మీరు పాడ్యమి శనివారం, మీనలగ్నము, రేవతి నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, బుధ, చంద్రులు ఉండటం వల్ల మీరు చదువులపట్ల ఏకాగ్రత వహించి నెమ్మదిగా పురోభివృద్ధి పొందండి. మీ 23 లేక 24 సంవత్సరము నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
వేంకటేశ్వర స్వామిని తులసీదళాలతో పూజించడం వల్ల కలిసివస్తుంది. 2004 నుంచి శుక్ర మహర్థశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2017 జూలై నుంచి 2024 వరకు యోగాన్ని ఇస్తుంది. బాగుగా స్థిరపడతారు. వివాహం అవుతుంది. సత్ఫలితాలు ఉంటాయి. ఏదైనా దేవాలయాల్లో కానీ, ఉద్యానవనాల్లో కానీ విప్ప చెట్టును నాటిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.