ఆర్. నాగదీప్తి- కావలి: మీరు అష్టమి బుధవారం, మిథునలగ్నము, ఆశ్లేష నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. లక్ష్మీనారాయణుడిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది. భర్త స్థానము నందు ఇంద్రుడు వరుణుడు ఉండటం వల్ల గురుచంఢాల దోషం ఏర్పడటం వల్ల మీ భర్తకు ఆర్థికంగా అనుకున్నంత పురోభివృద్ధి ఉండజాలదు. ఇది తాత్కాలికమే అని గమనించండి. 2004 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. 2018 నుంచి 2024 వరకు యోగాన్నిస్తాడు.
ఇందు మీ భర్త ఆర్థికంగా అభివృద్ధి పొందుతాడు. స్థిరాస్తులు అమర్చుకుంటారు. సుఖజీవనానికి, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధికి బొప్పాయి చెట్టును నాటిన మీ సంకల్పం సిద్ధిస్తుంది. మీ వారిచేత చింత మొక్కను ఉద్యానవనాల్లో నాటించండి. దోషాలు తొలగిపోతాయి.