జి. చంద్రశేఖర్- తిరుపతి: మీరు విదియ సోమవారం, కర్కాటక లగ్నము, శతభిష నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. మీకు ఉత్తరం కానీ పడమర ముఖాల గల గృహం కలిసివస్తుంది. తేలిక రంగు దుస్తులు మీకు శుభం, కనకదుర్గా అమ్మవారిని ఎర్రని పూలతో పూజించడం వల్ల మీరు బాగుగా అభివృద్ధి చెందుతారు. 2011 నుంచి సెప్టెంబర్ నుంచి శని మహర్ధశ ప్రారంభమైంది. ఈ శని 2017 మే నుంచి 2030 వరకు మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఏదైనా దేవాలయాల్లో అరటి చెట్టును నాటిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.