కె. రాజేష్.. మీరు శనిని పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి

బుధవారం, 5 డిశెంబరు 2012 (17:40 IST)
FILE
కె. రాజేష్ - తణుకు

మీరు తదియ మంగళవారం, తులా లగ్నము, అశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల వ్యాపారాల్లో ఓర్పు, నేర్పు, సహానం చాలా అవసరం అని గమనించండి. వ్యాపారాలలో నష్టపోయే ఆస్కారం కూడా ఉంది. మీరు తాత్కాలికంగా ఉద్యోగం చేసినా లేక మీ కుటుంబీకుల పేరుతో వ్యాపారాలు చేసి కలిసిరాగలదు.

ఏజెన్సీ, రియల్ ఏస్టేట్, కంజూమరు, కాంట్రాక్టు, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన వ్యాపారాలు బాగుగా కలిసివస్తాయి. 2015 నుంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ప్రతీ శనివారం, 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి దేవగన్నేరు పూలతో శనిని పూజించినా మీకు ఆటంకాలు తొలగిపోగలవు. ఈ క్రింది శ్లోకాన్ని ప్రతీ రోజూ పడమర ముఖంగా తిరిగి 17 సార్లు పటించండి. మీకు శుభం కలుగుతుంది.
"ఓం రవి సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నఃశని ప్రచోదయాత్ "

వెబ్దునియా పై చదవండి