శ్రీనివాసులూ.. తెల్ల జిల్లేడు పూలతో శనిని పూజించండి.

సోమవారం, 3 డిశెంబరు 2012 (17:45 IST)
FILE
శ్రీనివాసులు-కడప:

మీరు అమావాస్య శుక్రవారం, తులాలగ్నము, జేష్ట నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల ఆరోగ్యములో చికాకులు, కాళ్ళు, పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటున్నారు.

2019 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్ల జిల్లేడు పూలతో శనిని పూజించినా ఆరోగ్యము చేకూరుతుంది. ఏదైనా దేవాలయాల్లో కాని, విద్యాసంస్థల్లో గాని, ఖాళీ ప్రదేశాల్లోగాని కొబ్బరి చెట్టును నాటి దాని అభివృద్ధి తోడ్పడండి.

వెబ్దునియా పై చదవండి