సత్యప్రసన్న గారూ.. మీకు 23 లేదా 24 సంవత్సరంలో వివాహమవుతుంది
గురువారం, 29 నవంబరు 2012 (17:52 IST)
FILE
సత్యప్రసన్న- అమలాపురం:
మీరు తదియ గురువారం, తులా లగ్నము, అశ్వని నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. లగ్నము నందు బుధ, శుక్ర, రాహువులు ఉండటంవల్ల, తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అని గమనించండి. మనఃకారకుడైన చంద్రుడిని కేతువు పట్టడం వల్ల ప్రతీ చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. చదువుల్లో ఏకాగ్రత వహించండి.
సామాన్యమైన చదువుల్లోనూ, సాంకేతిక రంగాలలో రాణిస్తారు. మీ 23 లేక 24 సంవత్సరములు నందు స్థిరపడతారు. వివాహం అవుతుంది. వల్లీదేవసేనేస సుబ్రమణ్యస్వామిని పూజించడం వల్ల మీకు ఆటంకాలు తొలగిపొతాయి.