12-07-2020 నుంచి 18-07-2020 వరకు మీ వార రాశి ఫలితాలు

శనివారం, 11 జులై 2020 (16:29 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. రుణ సమస్యలు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టిపెడుతారు. పెద్దమొత్తం ధన సహాయం తగదు. పనులు సానుకూలమవుతాయి. మంగళ,బుధ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి, దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. అపరిచితులతో జాగ్రత్త. ఆత్మీయుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మానసికంగా కుదుట పడుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు పనిభారం. విశ్రాంతి లోపం. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం కలసివస్తుంది.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2, పాదాలు
యత్నాలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీనమ్మకం వమ్ముకాదు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పరిచయాలు అధికమవుతాయి. వ్యాపకాలుసృష్టించుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. గురు,శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఇంటి విషయాలపై శ్రద్ద అవసరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. షాపు పనివారలతో జాగ్రత్త. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆలయాలు సందర్శిస్తారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3పాదాలు
మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పరిస్థితులు క్రమంగా మెరుగు పడతాయి. మాట నిలబెట్టుకుంటారు. బంధువులకు మీపై అభిమానం కలుగుతుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు హడావిడిగా సాగుతాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అపరిచితులతో జాగ్రత్త. మీ శ్రీమతి సలహా పాటించండి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుతంటాయి.ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వచ్చే సూచనలున్నాయి.
 
కర్కాటం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. బంధుమిత్రులు మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. గృహంలో స్తబ్దత తొలుగుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు నగదు జాగ్రత్త. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగు పడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. ఆత్మీయుల సలహా పాటించండి. పదవులు,సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా వ్యవహరంచండి. అంతరంగిక విషయాలు వెల్లడంచవద్దు. ఉద్యోగస్తులకు పదోన్నతి, అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. షేర్లు విక్రయాలు అనుకూలం.
 
సింహం: మఖ, పుబ్బ,ఉత్తర 1 వ పాదం
ఈవారం ప్రతికూలతలు అధికం. అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. పట్టుదలకు పోవద్దు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సంతృప్తికరం. సకాలంలోవాయిదాలు చెల్లిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేనివారితో జాగ్రత్త, గుట్టుగా యత్నాలు సాగించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. గృహమార్పు  అనివార్యం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధ్యాయులకు స్థానచలనం. విద్యార్థులకు దూకుడు తగదు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. కష్టానికి గుర్తింపు ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఆది, సోమ వారాల్లో పనులుసాగవు. సోదరులతో విభేదిస్తారు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ప్రధానం. అలవాట్లను అదుపులో ఉంచుకోండి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆత్మీయుల హితవు మీపై ప్రభావం చూపుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం చదువులపై శ్రద్ద వహించండి. ద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ చేతులు మీదుగా సాగుతాయి. మీ సలహా ఎదుటి వారికి లాభిస్తుంది. పరిచయాలు బలపడుతాయి. వ్యతిరేఖులు సన్నహితులవుతారు. పనులు సకాలంలో పూర్తికాగలవు. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. బంధువులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. బుధ, గురు వారాల్లో ఒక సమాచారం ఆలోచింప జేస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థ పడతారు. పెట్టుబడులకు సమయం కాదు. ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమం ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో రాణించవు. అనుభవం గడిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
కొత్త సమస్యలు ఎదురౌతాయి. సామరస్యంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. దంపతుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. ఆత్మీయుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. శుక్ర,శని వారాల్లో సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రం లభ్యమవుతాయి. సంతానం ద్వారా శుభవార్త వింటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్ద మొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు పదోన్నతి. స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు క్రమంగా మెరుగు పడుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గుట్టుగా వ్యవహరించండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా పడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభ కార్యానికి యత్నాలు సాగిస్తారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. స్థిరాస్థి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సత్తా చాటుకుంటారు. పదవుల స్వీకరణ అనుకూలం, వ్యతిరేకులు సన్నహితులవుతారు. బంధుత్వాలు విస్తరిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. సందేశాలు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సోమ, మంగళ వారాల్లో పనులు సాగవు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. ఉపాధ్యాయులకు స్థానచలనం అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. భాగస్వామికవ్యాపారాలకు అనుకూలం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతను అధిగమిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ఖర్చులు అధికం సంతృప్తికరం, పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేటు సంస్థలో మదపు తగదు. చెల్లిపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. పెద్దల సలహా పాటించండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు.పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు నెరవేరవు. శుక్ర, శని వారాలల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతారు. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ప్రైవేటు సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృధ్దికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు