వేపాకుల నీటితో స్నానం చేస్తే...?

గురువారం, 1 నవంబరు 2018 (16:21 IST)
చలికాలం వచ్చేంది.. ఇప్పుడు ఎక్కడ చూసినా దగ్గు, జలుబు, జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యల నుండి ఎలా విముక్తి లభిస్తుందో తెలుసుకుందాం.. వేపాకు లేని ఇళ్లుండదు. వేపాకు కషాయంతో దగ్గు, గొంతునొప్పికి చెక్ పెట్టవచ్చును.. అంతేకాకుండా చర్మం దురదలుగా ఉన్నప్పుడు వేపాకు నీటితో స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
జలుబు వలనే దగ్గు వస్తుంది. కాబట్టి జలుబు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.. కప్పు వేపాకులను నీటిలో మరిగించుకుని ఆ నీటిలో కొద్దిగా పసుపు, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, శొంఠి వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత ఆ నీటిని వడగట్టి అందులో కొద్దిగా తేనె లేదా చక్కెర కలిపి ప్రతిరోజూ మూడుపూటలా సేవిస్తే జలుబు వెంటనే తగ్గుతుంది.
 
ఇక తలనొప్పి వచ్చిదంటే చాలు.. తల భారంగా ఉంటుంది. ఏ పని చేయాలన్న విసుగుగా ఉంటుంది. చాలామందికి కళ్లు తిరుగుతాయి. అలాంటప్పుడు కొన్ని వేపాకులను మెత్తగా నూరుకుని ఆ మిశ్రమాన్ని నుదిటిపై రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచుకుని ఆ తరువాత శుభ్రం చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అలాకాకుంటే వేపాకులతో కషాయం తయారుచేసి తీసుకోవచ్చును.
 
ఈ చలికాలం వస్తేనే చాలు.. దానికి తోడుగా దోమలు కూడా వచ్చేస్తుంటాయి.. దోమలు తొలగించాలంటే.. వేపాకులను నీళ్లల్లో మరిగించి ఆ నీటిని ఇంట్లో చల్లుకోవాలి. ఇలా చేస్తే దోమలు రావు. అలానే దోమలు కుట్టినప్పుడు చర్మం కందినట్లుగా మారుతుంది. అప్పుడు ఏం చేయాలంటే.. వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు