ప్రధాన పెట్టుబడిదారులను ఆకర్షించడం, ఐటీ, టెక్నాలజీ కంపెనీలను స్థాపించడం, విద్యా రంగంలో సంస్కరణలను ప్రవేశపెట్టడం కోసం మద్దతు కోరింది. చర్చల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి కేంద్రం నుండి మరిన్ని సహాయం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో కేంద్ర పథకాలను చురుకుగా అమలు చేస్తోందని ఆయన ప్రధానమంత్రికి హామీ ఇచ్చారు. 
	 
	మోదీతో నారా లోకేష్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఇది కేవలం నాలుగు నెలల్లోనే ప్రధానితో ఆయన రెండవ సమావేశం. ఇంతకుముందు మే 17న నారాలోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కుటుంబ సమేతంగా ప్రధానిని కలిశారు.