3. ఉసిరికాయలలోని గింజలను తీసివేసి, దానికి సమానంగా పసుపు తీసుకుని రెంటినీ కలిపి బాగా దంచి పొడి చేసుకోవాలి. దీన్ని రోజుకు రెండుపూటలా ఒక చెంచా చొప్పున మజ్జిగలో కలుపుకుని తాగుతుంటే షుగర్ వ్యాధి పూర్తి కంట్రోల్లో ఉంటుంది.
4. పొడిపత్రి అనే ఆకు వనమూలికలు అమ్మే కొట్లలో లభిస్తుంది. పల్లేటూర్లలో ఉండే వాళ్లకి ఈ మొక్క బాగా తెలుస్తుంది. పొడపత్రి ఆకులు, మారేడు లేత చిగుళ్ళు, నేరేడు గింజల లోపలి పప్పు, లేత వేపచిగుళ్ళు, పత్తిగింజల లోపలి పప్పు.. వీటన్నింటిని సమానంగా తీసుకుని బాగా ఎండబెట్టి ఆ తరువాత పొడి చేసుకోవాలి.