జీర్ణశక్తిని పెంచే ఆయుర్వేద మూలికలు

శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (22:37 IST)
జీర్ణశక్తిని పెంచే కొన్ని మూలికలు గురించి చూద్దాం. ఉసిరికాయకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత వుంది. ఇది జీర్ణ మండల వ్యవస్థ మొత్తంలో ఏర్పడే చికాకుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినాలనిపించేలా చేసే రక్త-చక్కెర అపసవ్యతల్ని ఇది నిరోధిస్తుంది.

 
ఆయుర్వేదంలో మరో మూలిక బిబిహితకి. ఇది సురక్షితము, శక్తివంతము అయిన విరేచనకారి. జీర్ణావయవాలలో పేరుకున్న కఫాన్ని బయటకు పంపించడంలో ఉపయోగకరమైనది. మరో మూలిక పేరు చిత్రక. ఇది అతి ఆమ్లతను, పేరుకున్న ఆమాన్ని తగ్గిస్తుంది. పీల్చుకునే శక్తిని పెంచి, జీర్ణవ్యవస్థలో నిలబడిపోవడాన్ని ఇది నిరోధిస్తుంది.

 
ధనియాలు.. ఇవి జీర్ణమండల మార్గంలో పిత్త పరిస్థితులకు ప్రయోజనం కలిగిస్తాయి. అలాగే లవంగాలు వేడిచేసే గుణం, ఉత్సాహాన్నిచ్చే లక్షణాన్ని కలిగి వున్నాయి. ఇవి జీర్ణక్రియను ఉత్తేజపరిచి ఆరోగ్యకరంగా వుంచుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు