పసుపు వంటకాల్లో ఎక్కువగా వాడే పదార్థం. ఈ పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ప్రతిరోజూ మనం చేసుకునే కూరల్లో పసుపు వేసుకుంటే ఆ రుచేవేరు. తరచు దీనిని ఉపయోగిస్తే కడుపులోని ఇన్‌ఫెక్షన్స్ తొలగిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. పసుపులోని మరికొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం..
4. బరువు తగ్గాలనుకునేవారు నూనెలో కప్పు ఉల్లిపాయలను వేయించి అందులో స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తరువాత రెండు కరివేపాకు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషాల తరువాత దించేయాలి. ఇలా చేసిన మిశ్రమంలో వేడివేడి అన్నం కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బరువు తగ్గుతారు. అంతేకాదు, శరీరానికి కావలసిన ఎనర్జీనీ అందుతుంది.
5. కండరాలు, ఎముకలు బలంగా ఉండాలంటే.. పసుపు క్రమంగా తీసుకోవాలి. అలానే పసుపులో కొద్దిగా నిమ్మరసం, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం పాటు చేస్తే ముఖంపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి.