నల్ల జీలకర్ర నూనెతో జుట్టుకు నిగారింపు.. హెయిర్ ఫాల్‌కు బైబై

శుక్రవారం, 28 అక్టోబరు 2022 (19:29 IST)
Black Jeera Oil
నల్ల జీలకర్ర నూనెతో జుట్టు రాలడానికి చెక్ పెట్టవచ్చు. నల్ల జీలకర్ర నూనెను తలకు రాసుకుని తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడి జుట్టును చక్కగా సంరక్షించుకోవచ్చు. జుట్టు రాలడానికి చాలా కారణాలున్నాయి. పోషకాహార లోపం, చుండ్రు, ఒత్తిడి కారణంగా జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. 
 
జుట్టు రాలే సమస్యను దూరం చేసుకోవాలంటే.. నల్ల జీలకర్ర నూనె మనం ఇంట్లోనే తయారుచేసుకుని వాడుకోవచ్చు. నల్ల జీలకర్ర నూనె మిశ్రమాన్ని మీ తలకు రాసుకుని బాగా నానబెట్టి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. 
 
కొబ్బరినూనె, నల్లజీలకర్ర నూనెతో కలిపి తల మాడుకు బాగా మర్దన చేయాలి. ఆపై గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టును సంరక్షించుకోవచ్చు. అలాగే జుట్టు పొడిబారడం తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు