ముల్లంగితో పాటు ఆకులు, కాండం, గింజల్లో పుష్కలమైన ఔషధ గుణాలు వున్నాయి. ముల్లంగి, బచ్చలికూర మధుమేహానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ముల్లంగి ఆకు వివిధ రుగ్మతలను నయం చేస్తుంది. ముల్లంగి ఆకుకూరలు గుండెకు బలాన్నిస్తాయి.
అలాగే గుండె జబ్బులు, గుండె దడ, గుండె బలహీనతతో బాధపడేవారు కనీసం వారానికోసారైనా ఈ ఆకుకూరను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.