జీలకర్ర లేని వంటిల్లు లేదు. దీనిని ఎక్కువగా కూరల్లో వాడుతుంటాం. ఇది రెండు రకాలుగా దొరుకుతాయి. అవి నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర. ఈ రెండింటిలో అనేక ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీలకర్ర కషాయంతో తామర, తెల్లమచ్చలు వంటివి తొలగిపోతాయి. ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణాన్ని పాలలో కలుపుకుని పొడిచేసుకోవాలి.
ఈ పొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. నులి పురుగుల సమస్యలు కూడా తొలగిపోతాయి. జీలకర్ర కషాయాన్ని ప్రతిరోజూ తీసుకుంటే గుండెనొప్పి వంటి వ్యాధులు దరిచేరవు. అంతేకాకుండా రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుటకు జీలకర్ర ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ఈ కషాయాన్ని తాగడం వలన సైనస్ నుండి ఉపశమనం లభిస్తుంది.
జీలకర్రను నేతిలో దోరగా వేయించుకుని ఆ మిశ్రమాన్ని పొడిచేసి అందులో సైంధవ లవణం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రెండుపూటల తీసుకుంటే గర్భాశయ బాధలు తగ్గుతాయి. ఈ పొడిని అన్నంలో, మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే కూడా మంచిది. ధనియాలు, జీలకర్రను వేయించి వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడిలో సైంధవ లవణం, ఉప్పును వేసి కలుపుకోవాలి.