కరివేపాకు లేని తాలింపు వుండదు. కూరల్లో వంటల్లో కరివేపాకు తప్పనిసరి. కరివేపాకు రుచి, సువాసకు మాత్రమే కాదు. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి... వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు వత్తుగా పెరుగుతాయి.
అలెర్జీలతో బాధపడేవారు.. కరివేపాకు, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఓ స్పూన్ మోతాదులో నెలరోజుల పాటు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేపాకు రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఇక కరివేపాకు, వేప పేస్టు అర స్పూన్ మోతాదులో అరకప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి. కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయి.
వాతావరణ కాలుష్యం, అధిక ఒత్తిడి కారణంగా నేటి యూత్‌కు చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేసింది. తెల్లజుట్టుకు చెక్ పెట్టాలంటే రోజూ మనం తీసుకునే ఆహారంలో కరివేపాకును తీసుకుంటే సరిపోతుంది. కరివేపాకుని మాత్రం వేయించి లేదా ఎండబెట్టిగానీ పొడిచేసి పెట్టుకుని రోజూ ఓ స్పూన్ తేనెతో కరివేపాకు పొడిని అదే మోతాదులో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని.. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.