జీలకర్రలో మాంగనీస్, ఐరన్, పొటాషియం, ఫైబర్ అధికంగా లభిస్తుంది. అధిక ప్రోటీన్లున్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు వాటితో జీరా కూడా జతకలిస్తే.. ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. జీర్ణప్రక్రియ సరిగా ఉంటే శరీరానికి ఎలాంటి ఇబ్బందులుండవు. అందుకు జీరా చక్కగా తోడ్పడుతుంది కాబట్టి కొవ్వు నియంత్రణలో ఉంటుంది. జీరాలోని ఫైబర్ కణాల కదలికకు తోడ్పడుతుంది.
శరీరంలో నీరు వుంటే ఊబకాయం తప్పదు. అలాంటి తరుణంలో జీరా నీటిని సేవించడం చేయాలి. జీరాలో థైమోల్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుచేత ఒక గ్లాసు నీటిలో జీరా ఓ స్పూన్ చేర్చి ఆ నీటిని అరగంట తర్వాత తాగితే మంచి ఫలితం వుంటుంది. అలాగే జీలకర్ర రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది.