కరివేపాకు లేనిదే ఏ కూర చేయరు. అంటే భారతీయ వంటల తయారీలో కరివేపాకుకు అంత స్థానం ఉందన్నమాట. అలాంటి కరివేపాకును కొందరు ఇష్టంగా ఆరగిస్తే మరికొందరు మాత్రం ఆకు కదా అని తీసిపారేస్తారు. నిజానికి కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఏ ఒక్కరూ కూడా దాన్ని తీసిపడేయరు. అలాంటి కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు ఏంటో పరిశీలిద్ధాం.
* కరివేపాకు పొడితో అన్నం ఆరగిస్తే అజీర్తి తగ్గిపోతుంది. పైగా, ఆకలి పెరుగుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అయితే, కరివేపాకులకు మెంతులు, మిరియాలు కూడా కలిపి పొడి చేసుకుంటే ఇంకా మంచిది.
* కరివేపాకులో అనేక పోషకాలు ఉన్నాయి. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఆంటీయాక్సిడెంట్స్, కెరోటిన్, ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలతో పాటు.. పిండిపదార్థాలు, ఫైబర్, మినరల్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల నిత్యం కరివేపాకును ఆరగించడం వల్ల పైన చెప్పిన పోషకాలన్నీ శరీరానికి లభ్యమవుతాయి.