దేవదారు ఆకులను ఎండబెట్టి నువ్వుల నూనెతో కలిపి...

సోమవారం, 15 మార్చి 2021 (23:22 IST)
ఆధ్యాత్మికంగా ఎన్ని ప్రయోజనాలను ప్రసాదించే దేవదారుకు వైద్యంలో కూడా ఎంతో ప్రాధాన్యత వుంది. ఈ వృక్షం బెరడును చర్మవ్యాధులను నివారించే ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. దీని ఆకులను సువాసనలు యిచ్చే సుగంధ నూనె తయారీలో విరివిగా వాడతారు.
 
దేవదారు ఆకులను ఎండబెట్టి నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరినూనెతో వేసి కాచి పెట్టుకుని చల్లారిన తర్వాత తలకు రాసుకుంటూ వుంటే మెదడు, కంటి వ్యాధులు దరిచేరవు. రక్తపోటు వ్యాధి అదుపులో వుంటుంది.
 
ఆకుల నుంచి తీసే నూనెను కొన్ని చుక్కలు వేడినీటితో వేసుకుని స్నానం చేయడం వల్ల శ్వాసకోశ వ్యాధులు నివారింపబడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు