శ్వాస సక్రమంగా వుండాలంటే.. పెరుగులో నెయ్యి కలిపి..

బుధవారం, 14 నవంబరు 2018 (18:16 IST)
శ్వాస సక్రమంగా సాగాలంటే.. పెరుగులో నెయ్యి కలిపి రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే చలినుండి కాపాడుకోవడానికి కలకండలో నిమ్మకాయ పిండుకుని తాగాలని వారు చెప్తున్నారు. పగలంతా ఒకే చోట కూర్చుని పనిచేసేవారు ఉదయం వాకింగ్ చేయాలి.


శరీరంపై చెమట వున్నప్పుడే నీళ్ళుతాగడం, నీడన కూర్చుని ఎక్కువగా గాలి పీల్చడం వలన గుండె, తలలో నొప్పులు వస్తాయి. భోజనం చేసేటప్పుడు కాస్త మంచినీరు త్రాగండి. భోజనానంతరం నీళ్ళు ఎక్కువగా తాగకూడదు.
 
ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే యూరినల్ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. కాలిన గాయాల నుంచి ఉపశమనం పొందాలంటే.. ఉల్లిపాయతో మర్దన చేయాలి. ఆహారంలో రోజూ ఉల్లిని చేర్చుకుంటే.. గుండెజబ్బులు, ఆస్తమా, అలర్జీ, నిద్రలేమి వంటి సమస్యలు దరిచేరవు. 
 
వర్షాకాలం, శీతాకాలంలో వీలైనంత వరకు హోటల్ ఫుడ్ తీసుకోకుండా వుండటం మంచిది. 
చిన్నపిల్లలను వర్షంలో తడవకుండా చూసుకుంటే వారికి చర్మ వ్యాధులు సోకవు. 
వర్షంలో తడిస్తే తప్పకుండా వేడి నీటిలో స్నానం చేయండి. 
దోమలు లేకుండా చూసుకుంటే చాలామటుకు అనారోగ్యాలను దూరం చేసినట్టేని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు