జాజికాయ పొడితో కొలెస్ట్రాల్ మటాష్..

బుధవారం, 8 జనవరి 2020 (15:22 IST)
జాజికాయ పొడితో కొలెస్ట్రాల్ పరార్ అవుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జాజికాయ పొడిలో కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 
 
ఇంకా జాజికాయ పొడి శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే రక్త సరఫరా మెరుగు పడుతుంది. జాజికాయల పొడిని రోజూ అరస్పూన్ తీసుకోవడం ద్వారా దంత సమస్యలు తొలగిపోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్‌, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
 
నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పూట భోజనంతో జాజికాయ పొడి తీసుకుంటే రోజూ రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. ఇంకా జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు