పనస పండుతో గుండెపోటును దూరం చేసుకోవచ్చు అంటున్నారు న్యూట్రీషియన్లు. పనసలో యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండే పనసను మితంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ కారకాలను తొలగించుకోవచ్చు. మధుమేహాన్ని, గుండెపోటును నియంత్రించే పనసలో పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అజీర్తిని దూరం చేసుకోవచ్చు.
అలాగే పనస పండును తేనెతో కలిపి తీసుకుంటే మెదడు నరాలు బలపడతాయి. వాత, పిత్త వ్యాధులు నయం అవుతాయి. పనసలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు, ఆరోగ్యానికి బలాన్నిస్తుంది. నరాలను బలపరుస్తుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అంటువ్యాధులను దూరం చేస్తుంది. పనస లేత తొనల్ని వేయించి తీసుకోవడం ద్వారా పిత్తం తొలగిపోతుంది.