తామర గింజలు బరువును తగ్గిస్తాయట.. డయాబెటిస్‌‌ని కూడా..?

మంగళవారం, 7 జులై 2020 (23:26 IST)
తామర గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చూసేందుకు పాప్ కార్న్‌లా వుండే ఈ తామర గింజలను అలాగే తీసుకోవచ్చు. లేదంటే కుక్ చేసుకుని తీసుకోవచ్చు. తామర గింజలను వాడటం ద్వారా మధుమేహాన్ని అదుపు చేసుకోవచ్చు. ఫాక్స్ నట్స్, లోటస్ సీడ్స్ అని పిలువబడే ఈ గింజల్లో అద్భుతమైన పోషక విలువలు వున్నాయి.  
 
ఉత్తరాదిలో ఉపవాసపు రోజుల్లో తామర గింజలను తీసుకుంటూ వుంటారు. ఆయుర్వేదంలోనూ వీటిని వాడుతారు. వీటిలో అధిక కెలోరీలు, చెడుకొవ్వులు ఏమాత్రం ఉండవు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇవి దివ్యౌషధం. వీటిలో మంచి కార్బ్‌లు, ప్రొటీన్లు, బి1, బి2, బి3 విటమిన్లు, ఫొలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్ మొదలైనవి వున్నాయి. అధిక రక్తపోటుకు కూడా ఇదే దివ్యౌషధం అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
యాంటీ ఆక్సిడెంట్‌లు తగిన మోతాదులో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో మఖనాలు అద్భుతంగా పనిచేస్తాయి. కనుక మధుమేహులు వీటిని తీసుకుంటే మంచిది. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కుగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు