విజృంభిస్తోన్న కరోనా.. పాకిస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రికి పాజిటివ్

మంగళవారం, 7 జులై 2020 (09:57 IST)
కరోనాను జయించేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇంతలో జరగాల్సిందంతా జరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సాధారణ ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. 
 
తాజాగా పాకిస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ జాఫర్‌ మీర్జా సైతం కరోనా బారినపడ్డారు. తనలో వైరస్‌ లక్షణాలు స్వల్పస్థాయిలో కనిపిస్తున్నాయని, తాను ప్రస్తుతం ఎవరినీ కలవకుండా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని సోమవారం ట్వీట్‌ చేశారు. పాకిస్థాన్‌లో కరోనా కట్టడికి ఆయనే కృషి చేస్తున్నారు. ప్రతిరోజు మీడియాకు కరోనా సమాచారాన్ని అందించేవారు.
 
కానీ ప్రస్తుతానికి ఆయనకో కోవిడ్ సోకడం ఆందోళనకు గురిచేస్తుంది. అంతేకాకుండా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆరోగ్య సేవల్లో ప్రత్యేక సహాయకునిగా పని చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు పాకిస్థాన్‌లో మొత్తం కేసుల సంఖ్య 231,818కు చేరింది. మొత్తం 4,762 మంది బాధితులు మృతి చెందారు. మరోవైపు 131,649 మంది ప్రజలు కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు