బీరకాయను వారంలో ఓ రోజు ఆహారంలో చేర్చుకుంటే?

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (15:30 IST)
బీరకాయను వారంలో ఓ రోజు ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా చేస్తే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. బీరకాయలో పీచు పుష్కలంగా ఉండటంతో సులభంగా జీర్ణమవుతుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌ అనే పదార్థం రక్తాన్ని శుభ్రపరిచి కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాక ఇది లివర్‌, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. బీరకాయలో కొవ్వు శాతం తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్లు బీరకాయను ఆహారంలో చేర్చుకోవచ్చు. 
 
రోజూ ఒక గ్లాసు బీర జ్యూస్‌ తాగితే కామెర్ల వ్యాధి సహజంగానే తగ్గుతుంది. ఇంకా అందరికన్నా షుగర్‌ వ్యాధిగ్రస్తులకి ఇది బాగా పని చేస్తుంది. బీరకూర రూపంలో అయినా, పచ్చడిలా, జ్యూస్‌లాగైనా తీసుకుంటే మధుమేహాన్ని దూరం చేస్తుంది. బీరకాయలో నేతిబీర, గుత్తిబీర, పందిర బీర, పొట్టి బీర అనే రకాలున్నాయి. అయితే ఈ బీరలో ఏఒక్కటి తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 
 
ఈ బీరకాయలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇంకా విటమిన్ సి, రిబోఫ్లోవిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. బీరకాయలోని పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు