వరుసకు చెల్లితో ప్రేమాయణం.. పురుగుల మందు తాగింది.. చివరికి ఏమైంది?

సెల్వి

బుధవారం, 4 మార్చి 2026 (16:35 IST)
వరుసకు చెల్లి.. కానీ ఆమెను కోరిక తీర్చమని వేధింపులకు గురిచేశాడు. ఆమెను ప్రేమిస్తున్నానని వేధించాడు. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఆమె. జగిత్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెల్లిలి వరస అయిన అక్షయ అమ్మాయిని మనోజ్ కుమార్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వేధింపులకు గురిచేశాడు. 
 
ఈ క్రమంలో ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అక్షయను.. ఆమె తమ్ముడిని చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది అక్షయ. 
 
ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ అక్షయ మృతి చెందింది. అక్షయ కుటుంబ సభ్యులను పరామర్శించి, వేధింపులకు గురి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మనోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు