పురుషులు నల్లతుమ్మ చూర్ణాన్ని తీసుకుంటే?

శుక్రవారం, 20 జులై 2018 (12:44 IST)
ఎండిన నల్ల తుమ్మకాయలు, బెరడు, బంక ఈ మూడింటిని సమంగా కలిపి చూర్ణం చేసుకుని స్పూన్ మోతాదులో రోజూ రెండు పూటలా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. నడుముకు శక్తి, బలం కలుగుతుంది. పూటకు పావు కప్పు లేత నల్లతుమ్మ ఆకుల రసాన్ని మూడు పూటలా సేవిస్తే బహిష్టు సమయంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చును.
 
చెట్టు బెరడు కషాయాన్ని పుక్కిలించినా లేదా ఈ చెట్టు నుండి తీసిన చిన్న బంక ముక్కను నోట్లో ఉంచుకున్నా నోటిలోని అల్సర్లు మానిపోతాయి. అరతులం బంక చూర్ణాన్ని అరకప్పు ఆవుపాలలో కలిపి రెండు పూటలు తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుకుతాయి. నల్లతుమ్మ చెట్టు కాయల చూర్ణం తీసుకున్నా ఇదే ప్రయోజనం కలుగుతుంది.
 
గింజ పట్టని లేత కాయలను నీడన ఎండించి చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణానికి సమానంగా ఖండశర్కర పొడి కలిపి పూటకు రెండు స్పూన్స్ చొప్పున నీటితో సేవిస్తూ ఉంటే పలుచబడిన వీర్యం చిక్కబడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు