ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటన నివారణ చట్టం 2025ను అధికారికంగా అమల్లోకి తీసుకుని వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటన చేస్తూ ఎవరూ కనిపించరాదు. అలా చేస్తే వారిని పునరావాస కేంద్రాలకు తీసుకుని వెళ్తారు. కాగా ఈ చట్టానికి రాష్ట్ర గవర్నర్ ఈ నెల 15న ఆమోద ముద్ర వేసారు. దీంతో ఈ నెల 27న జీవో జారీ చేయగా న్యాయశాఖ సెక్రటరీ ప్రతిభాదేవి జీవో ఎంఎస్ నె.58ని విడుదల చేసారు.