తలస్నానం చేసేముందు.. ఉల్లిరసాన్ని ఇలా మర్దన చేస్తే?

శుక్రవారం, 28 జూన్ 2019 (17:09 IST)
మనం దాదాపు అన్ని వంటకాల్లో ఉల్లిపాయను ఉపయోగిస్తాము. దీనిని చాలా మంది పచ్చిగా కూడా తింటారు. పచ్చి ఉల్లిపాయలను చికెన్ ఫ్రైలో సైడ్‌డిష్‌గా తింటారు. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడే ఉల్లిపాయ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో ఉల్లిని కోసి దాని వాసనను చూస్తే జలుబు త్వరగా తగ్గుతుంది. శరీరంపై ఉన్న మచ్చలు పోవాలంటే ఉల్లిపాయను కోసి చర్మానికి రుద్దుకుంటే సరిపోతుంది. 
 
చర్మం మృదువుగా కూడా తయారవుతుంది. ఉల్లిపాయను తలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అనేక రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం కూడా ఉల్లిపాయలో ఉంది. అందుకే ప్రతిరోజూ ఉల్లిపాయను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
కేశాలు చాలా అందంగా నిగనిగలాడాలంటే ఉల్లి రసాన్ని తలస్నానం చేసేముందు తలకు మర్దన చేయాలి. పచ్చి ఉల్లిపాయ ఎక్కువగా తినడం వల్ల పురుషులకు వీర్యం వృద్ధి ఎక్కువగా జరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు