అరటిపువ్వును వాడితే ఎంత మేలో తెలుసా?

గురువారం, 27 జూన్ 2019 (14:20 IST)
ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా మందిని వెంటాడుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా పలు రకాల రోగాలు సంక్రమిస్తున్నాయి. వీటన్నింటికీ మందులు వాడినా శాశ్వత పరిష్కారం లభించకపోవచ్చు. కృత్రిమ మందుల కంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో మనం వ్యాధులను నయం చేసుకోవచ్చు. వీటి వలన దుష్ప్రభావాలు కూడా ఉండవు.
 
అలాంటి వాటిల్లో అరటిపువ్వు ఒకటి. దీనిలో అనేక రోగాలను నయం చేసే గుణాలు ఉన్నాయి. అరటిపువ్వును కొంత మంది ఒక కూరగాయగా పరిగణిస్తారు. దానితో సలాడ్‌లు, సూప్‌లు చేసుకుని సేవిస్తారు. అరటిపువ్వును తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది, సుఖ విరేచనం అవుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు అరటిపువ్వును తినడం వలన మంచి ఫలితం కనబడుతుంది. 
 
ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి ఉండటం వలన నాడీవ్యవస్థ మీద మంచి ప్రభావం చూపి సక్రమంగా పని చేసేలా చేస్తుంది. వీర్య కణాల సమస్యతో ఇబ్బందిపడేవారు అరటిపువ్వుని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీర్యవృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది. అరటిపువ్వు ఆడవారిలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం అరికట్టడానికి ఉపయోగపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు