ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా..? కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటి నుంచి సత్వర ఉపశమనం పొందాలంటే? మెగ్నీషియం అధికంగా గల ఆహారాన్ని తీసుకోవాలి. పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు, జీడిపప్పు, నువ్వులు తదితరాల్లో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది. అలసటగా ఉన్నప్పుడు ఈ పదార్థాలు తీసుకుంటే తీసుకుంటే ప్రయోజనం వుంటుంది.
ప్రయాణంలో అలసినట్లైతే.. ఓ బకెట్ వేడి నీళ్లలో స్నానం చేయడం మంచిది. ప్రయాణాల తరువాత వెంటనే దైనందిన పనుల్లో నిమగ్నమయ్యే వారు ఎప్సంసాల్ట్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తే మంచిది. ఇక అన్నిటికింటే సులువైన మరో పద్ధతి కోల్డ్ థెరపీ చేయాలి. ఓ టవల్ లేదా మెత్తని గుడ్డలో కొన్ని ఐస్ ముక్కల్ని వేసి నొప్పి వున్నచోట సున్నితంగా రాయాలి. ఐస్ నుంచి అందే చల్లదనంతో రక్తప్రసరణ వేగం పెరిగి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.