చేపలు తిననివారు బదులుగా ఒమేగా -3 ఫాటీ యాసిడ్లు ఉండే అవిసెగింజలూ, బాదం, వాల్‌నట్లూ, పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని తీసుకోవాలి. విటమిన్ సి ఉండే పండ్లు తినడం కూడా తప్పనిసరే. చక్కెరశాతం తక్కువగా ఉండే పదార్థాలనే ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక కీళ్ల నొప్పులకు అధికబరువు కూడా ఒక కారణమే. బరువు తగ్గించుకునేందుకు వ్యాయామం చేస్తూనే పండ్లూ, తాజా కూరగాయలూ, ఆకుకూరలూ, చిరు ధాన్యాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.