రావి ఆకుల్లోని ఔషధ గుణాలు.. టీ సేవిస్తే.. చర్మవ్యాధులు పరార్

సోమవారం, 20 జులై 2020 (17:51 IST)
peepal leafs
రావిచెట్టులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రావి ఆకుల్లో గ్లూకోజ్, ఆస్టియోరిడ్, ఫినోలిక్ వంటి గుణాలున్నాయి. ఓ వైపు ఈ చెట్టుకు పూజలు చేస్తూనే.. మరోవైపు దీని ఆకులు, బెరడు, కాండం, విత్తనాలు, పండ్లను ఔషధాల తయారీలో వాడుతున్నారు. డయాబెటిస్ నివారణకు రావిచెట్టు ఆకులు ఎంతగానో ఉపయోగపడుతాయి. 
 
రావి చెట్టు ఆకులను తీసుకుని పొడిచేసి రెండు గ్లాసుల నీటిలో ఓ స్పూన్ పొడిని వాడాలి. ఆ నీటిని బాగా మరిగించి.. వడగట్టాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే... డయాబెటిస్ చాలా వరకూ నయం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. రావి ఆకుల్ని తింటే తామర లాంటి చర్మ వ్యాధులు రావు. రావి ఆకుతో టీ తయారుచేసుకొని తాగితే మంచిది. 
 
ఆస్తమా తగ్గాలంటే.. రావి ఆకు, పండ్లు, బెరడును విడివిడిగా ఎండబెట్టి... పొడి చేసుకోవాలి. వీటిని సమాన పరిమాణంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు వాడితే, ఆస్తమా సమస్య తగ్గుతుంది. రావి ఆకు పొడిని మూడు గ్రాములు తీసుకొని, నీటిలో కలిపి... రోజుకు రెండుసార్లు తాగినా చక్కగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు