పెద్దజియ్యర్ స్వామి బాగున్నారు, ఆందోళన వద్దు - టిటిడి ఛైర్మన్

శనివారం, 18 జులై 2020 (15:10 IST)
కరోనా సోకి పెద్దజియ్యర్ స్వామి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే సాక్షాత్తు స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే జియ్యర్‌కే కరోనా సోకడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తోంది. పెద్దజియ్యర్ స్వామికి స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
 
పెద్దజియ్యర్ స్వామి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అంతగా అవసరమైతే చెన్నైకి తీసుకెళతామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. పెద్దజియ్యర్ ఆరోగ్యంగా వున్నారు, ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం అస్సలు లేదన్నారు.
 
శ్రీవారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలకు సంబంధించి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను టిటిడి ఛైర్మన్ ఆదేశించారు. శ్రీవారి దర్సనాల కొనసాగింపుపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ తెలిపారు. అయితే దర్సనాలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఎక్కువగా ఉందన్న ప్రచారం ఎక్కువగా సాగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు