శరీరంలో వేడి తగ్గి మనసు ఉల్లాసాన్ని పొందుతుంది. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల కళ్లు ఎర్రబడి ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి వారానికోసారి కొబ్బరి నూనె లేదా నువ్వులనూనెతో తలస్నానం చేయడం వల్ల దృష్టి, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తలంటు స్నానం అంటే తల నుంచి అరికాళ్ల వరకు నూనె రాయాలి. అరగంట సేపు ఎండలో ఉండి స్నానం చేయడం మంచి ఆరోగ్యాన్నిస్తుంది.