తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. తిప్పతీగను కషాయంలా చేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. తిప్పతీగలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
4. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.
6. తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడకూడదు.