తేనె, నెయ్యి సమభాగాలుగా కలిపి ఎట్టి పరిస్థితుల్లో భుజించరాదు. తేనెను వాన నీటితో సమంగా కలిపి వాడితే అది అనారోగ్యాన్ని తెస్తుంది. తేనెను కొంచెం గోరువెచ్చని నీటితో తప్ప బాగా వేడిగా వున్న నీటితో తాగితే అది విషతుల్యమవుతుంది.
మాంసము తేనెగానీ, నువ్వులుగాని బెల్లముగాని, పాలుగాని, మినుములు కానీ ముల్లంగి కానీ మొలకెత్తిన ధాన్యాలు కానీ కలిపి వాడరాదు. వెల్లుల్లి, మునగ, తులసి మొదలైన పదార్థాలను తిని వెంటనే పాలు తాగరాదు. చేపలు తిన్న వెంటనే పాలు తాగకూడదు.