మోదుగ చెక్కరసంతో చేసిన కషాయం తీసుకుంటే? (video)

మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (10:44 IST)
వయసు పైబడకుండా, ఎన్నో వ్యాధులను జయించి చిరాయువును అందించగల అమృతశక్తి మోదుగ చెట్టుకి వుంది. ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మోదుగ చెక్కరసంతో చేసిన కషాయం తీసుకుంటే వాత శ్లేష్మాలు, మూల రోగాలు, స్త్రీ వ్యక్తిగత వ్యాధులు నయం అవుతాయి. మోదుగ ఆకుతో చేసిన విస్తరిలో భోజనం చేస్తే కడుపులో గడ్డలు, రక్తంలో వేడి, పైత్యం తగ్గుతాయి. తెల్లమోదుగ చెట్టు ఆకులు, పూలు, పైబెరడు, వేరు బెరడు, కాయలు సమభాగాలుగా చూర్ణాలుగా చేసుకుని ఒక చెంచా చూర్ణాన్ని చెంచా తేనెతో తీసుకుంటే సర్వరోగాలు తగ్గుతాయి.
 
గ్రాము మోదుగ గింజల చూర్ణానికి 5 గ్రాముల బెల్లం కలిపి నూరి పరగడుపున తింటే బహిష్టు నొప్పి తగ్గుతుంది. మోదుగ గింజలను నిమ్మరసంతో మెత్తగా నూరి గజ్జి, తామరలకు పైనపూస్తే ఒక్కరోజులోనే రోగం తగ్గిపోతుంది. మోదుగ గింజలను మంచినీటితో మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టుకుని రెండుపూటలా ఒక్క మాత్ర వేసుకుంటే మూలవ్యాధి తగ్గుతుంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు