వెలగ పండు. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. ఈ వెలగపండుతో శరీరానికి చేకూరే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అల్సర్‌తో బాధపడే వారు వెలగ పండు తింటే ఉపశమనం కలుగుతుంది. ఈ పండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధికి మంచిది.
ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి. అలసట, నీరసం ఆవహించినప్పుడు వెలగపండు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లు ఈ పండ్లు తింటే ఆ సమస్యలు తగ్గుతాయి.