స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకోండి.. ఓరల్ క్యాన్సర్‌కు చెక్ పెట్టండి...

FILE
బెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే.. ఓరల్ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. బెర్రీ ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీతో పాటు కలర్ ఫుల్ ఫ్రూట్స్‌ను వారానికి మూడు సార్లు తీసుకోవడం లేదా రోజుకు ఒక్కోటి తీసుకోవడం ద్వారాక్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నీలం, ఎరుపు, నలుపు రంగు బెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా వాటిలో కాంపౌండ్లు చర్మ సంబంధిత వ్యాధులను సైతం నయం చేయడంతో పాటు ఓరల్ క్యాన్సర్‌ను నియంత్రిస్తాయి.

ముఖ్యంగా నలుపు రంగులు బెర్రీ పండ్లను తీసుకుంటే నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఓహియోస స్టేట్ యూనివర్శిటీ స్టడీలో తేలింది.

వెబ్దునియా పై చదవండి