కుంకుమ పువ్వు గర్భిణీలకు ఎంత వరకు మేలు చేస్తుంది!

గురువారం, 17 జులై 2014 (15:37 IST)
కుంకుమ పువ్వు గర్భిణీలకు ఎంత వరకు మేలు చేస్తుందో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. కుంకుమ పువ్వును గర్భిణీ మహిళలు తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువు తెలుపుగా పుడతారని చెప్తుంటారు. 
 
అయితే కుంకుమ పువ్వు సుఖ ప్రసవానికి సహకరిస్తుందట. సుఖ ప్రసవం కావాలంటే.. ప్రసవ నొప్పులతో బాధపడే గర్భిణీ స్త్రీలకు అరస్పూన్ కుంకుమపువ్వును సోంపు కలిపిన నీటిలో మిక్స్ చేసి ఇస్తే సుఖ ప్రసవం ఏర్పడుతుంది. 
 
అలాగే గర్భిణీ స్త్రీలు తమలపాకుతో కాస్త కుంకుమపువ్వును కలిపి తీసుకుంటే లేదా పాలలో కుంకుమ పువ్వును చేర్చి తీసుకోవడం ద్వారా శిశువు తెల్లగా పుడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అలాగే గర్భిణీ మహిళలు ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ కోసం ఆకుపచ్చని కూరగాయలను తీసుకోవాలి. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజూ అరగంట పాటు నడవడంతో పాటు మంచి విశ్రాంతి అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి