మెగాస్టార్ చిరంజీవి, మౌని రాయ్‌పై చిత్రీకరించిన అద్భుతమైన డ్యాన్స్ నంబర్‌తో విశ్వంభర షూటింగ్ గ్రాండ్‌గా పూర్తయ్యింది. ఈ చిత్రం మొత్తం స్కోర్‌ను ఆస్కార్ విజేత MM కీరవాణి కంపోజ్ చేస్తున్నారు. మాస్-అప్పీల్ ట్రాక్‌లతో అలరించే భీమ్స్ సిసిరోలియో ఈ హై-ఎనర్జీ డ్యాన్స్ నంబర్‌ను కంపోజ్ చేశారు.
100 మంది డ్యాన్సర్స్‌తో ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించారు. చిరంజీవి డ్యాన్స్ ఫ్లోర్‌లో తన సిగ్నేచర్ గ్రేస్‌తో అదరగొట్టారు. మంచి డ్యాన్సర్ అయిన మౌని రాయ్ తనదైన స్పార్క్‌ని యాడ్ చేశారు. గ్రాండ్ స్కేల్ లో ఉన్న ఈ పాట విజువల్ వండర్ గా ఉండబోతోంది. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. చోటా కె నాయుడు డీవోపీ కాగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. సినిమా రిలీజ్ డేట్ తో అనౌన్స్మెంట్‌తో పాటు, ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, స్పెషల్ సాంగ్‌లో మౌని రాయ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి, భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్