ఎడారి ఖర్జూరాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. ఏ పండైనా పండితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా ఉంటుంది. ఖర్జూరాలతో తయారుచేసే ఆహార పదార్ధాలను, ఖర్జూరాలను రంజాన్ సమయంలో ముస్లింలు తీసుకుంటారు.
ఖర్జూరాల్లో అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. రక్తస్రావాన్ని అరికట్టి శరీరానికి శక్తినిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. గర్భిణీలు మహిళలు ప్రసవానికి నాలుగు వారాల ముందు రోజుకు నాలుగు ఖర్జూరాలు తింటే ప్రసవం సులువుగా అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.