మునగాకులో ఆరోగ్య పోషకాలు ఎన్నో వున్నాయి. ఇనుము, పొటాషియం, సోడియం, కాల్షియం, కాపర్, జింక్, మెగ్నీషియం, మాంగనీసు, విటమిన్ ఏబీసీ, బీటా కరోటీన్, బీ కాంప్లెక్స్, టైటాజీ బైపర్, కార్పోహైడ్రేట్స్, ప్రొటీన్లు వున్నాయి. మునగాకును కూరల్లో కాకుండా సూప్ తరహాలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.