గర్భిణీలకు సాధారణ మహిళలతో పోలిస్తే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు డార్క్ కలర్ చాక్లెట్‌ను తీసుకుంటే యాంటీ యాక్సిడెంట్లు గర్భిణీ మహిళకు ఎంతగానో మేలు చేస్తాయి. బిడ్డతో పాటు తల్లికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కానీ తినబోయే ముందు గర్భిణీలు డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే చాకొలేట్స్ తినడం వల్ల డయాబెటిస్ పెరిగిపోయి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
డార్క్ కలర్ చాక్లెట్లలో ఐరన్, మెగ్నిషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గర్భిణీ మహిళలకు, గర్భస్థ శిశువు చాలా అవసరం. గర్భం దాల్చిన మహిళలు సహజంగానే నిత్యం ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో వారు డార్క్ కలర్ చాకొలేట్స్‌ను తింటే అది వారి మూడ్‌ను నియంత్రించి ఒత్తిడి తగ్గేలా చేస్తుంది. బీపీని తగ్గించాలంటే డార్క్ చాక్లెట్ తినాల్సిందే.