గర్భంతో ఉన్న మహిళలు పోషకాహారం తీసుకోవాలి. ఒత్తిడికి గురికాకూడదు. ప్రశాంతంగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు ఒత్తిడికి గురైతే కలిగే దుష్ప్రభావాలపై అమెరికాలోని ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. గర్భంగా ఉన్న మహిళ ఒత్తిడి గురైతే దాని ప్రభావం పుట్టపోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై అంత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
తల్లి ఒత్తిడికి గురయ్యే సమయంలో జన్మించే పిల్లలు కూడా ఒత్తిడి, చదువులో వెనుకబాటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ఎలుకలపై జరిపిన ఈ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురైన గర్భంతో కూడిన ఎలుకలో గుండె, పేగులవాహికల్లోని బ్యాక్టీరియా తీవ్ర మార్పులకు గురైనట్టు గుర్తించారు. వాటికి పుట్టిన పిల్లల్లోనూ ఇలాంటి మార్పులే కనిపించాయి. అందుకే గర్భంతో ఉన్న మహిళలు ఆందోళనకు గురికాకూడదని వైద్యులు సూచిస్తున్నారు.